ఆత్మహత్యాయత్నం కేసులో పోలీసుల తీరు సరికాదు

ABN , First Publish Date - 2020-12-07T05:52:40+05:30 IST

వైసీపీ వేధింపులతో ఆత్మహత్యాయత్నం చేసి చావు బతుకుల మధ్య కొట్టి మిట్టాడుతున్న పంపన ఆనందరావు విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు.

ఆత్మహత్యాయత్నం కేసులో పోలీసుల తీరు సరికాదు

  •  బాధ్యులపై కేసులు నమోదు చేయాలి 
  • మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి 

అనపర్తి, డిసెంబరు 6: వైసీపీ వేధింపులతో ఆత్మహత్యాయత్నం చేసి చావు బతుకుల మధ్య కొట్టి మిట్టాడుతున్న పంపన ఆనందరావు విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఆదివారం రామవరంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండురోజులపాటు అనపర్తి పోలీసులు చేసిన వేధింపుల వల్లే ఆనందరావు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడన్నారు. ఎస్పీ స్పందిం చి ప్రత్యేక బృందంతో విచారణ నిర్వహించి వేధింపులకు గురిచేసిన వైసీపీ నాయకులపై, విచారణ పేరుతో వేధించిన పోలీసులపైనా కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. పోలీసుల వేధింపుల వల్లే తన కుమారుడు ఆత్మహత్యాయత్నం చేశాడని ఆనందరావు తల్లి చెబుతున్నా పులగుర్త వైసీపీ నాయకులు ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసి కుటుంబ కలహాల వల్లే ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని చెప్పించడం తగదన్నారు. ఇటీవల రామవరంలో పేకాట శిబిరాలపై పోలీసులు జరిపిన దాడుల్లో వైసీపీ నాయకుడి ఇంటిలో పేకాటరాయిళ్లు దొరికారని, స్థానిక పోలీసులు అమాయకులపై కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఆనందరావు ఉదంతం జరిగిందని ఆరోపించారు. సమావేశంలో కొవ్వూరి శ్రీనివాసరెడ్డి, కర్రి వెంకటరామారెడ్డి, తమలంపూడి సుధాకరరెడ్డి, సిరసపల్లి నాగేశ్వరరావు, పులగం అచ్చిరెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-07T05:52:40+05:30 IST