గుర్తు తెలియని మృతదేహం

ABN , First Publish Date - 2020-12-11T06:04:34+05:30 IST

జి.మేడపాడు-సామర్లకోట రైల్వే లైన్‌లో సుమారు 38 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని పురుషుడి మృత దేహాన్ని గురువారం స్వాధీనం చేసుకున్నట్టు సామర్లకోట జీఆర్పీ ఎస్‌ఐ బి.లోవాచారి చెప్పారు.

గుర్తు తెలియని మృతదేహం

సామర్లకోట, డిసెంబరు 10: జి.మేడపాడు-సామర్లకోట రైల్వే లైన్‌లో సుమారు 38 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని పురుషుడి మృత దేహాన్ని గురువారం స్వాధీనం చేసుకున్నట్టు సామర్లకోట జీఆర్పీ ఎస్‌ఐ బి.లోవాచారి చెప్పారు. రైల్వే కీమెన్‌ అందించిన సమాచారం మేరకు సంఘటన స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి ఒంటిపై వంగపువ్వు రంగు ఫుల్‌ హ్యాండ్స్‌ చొక్కా, నలుపు రంగు గీతలున్న లుంగీ ఉన్నట్టు చెప్పారు. మృతదేహన్ని పోస్టుమార్టమ్‌ నిమిత్తం పెద్దాపురం తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు. 

Updated Date - 2020-12-11T06:04:34+05:30 IST