ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందాలి
ABN , First Publish Date - 2020-11-13T05:48:56+05:30 IST
గోకవరం, నవంబరు 12: ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలన్నీ అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ అనుపమ అంజలి అధికారులకు సూచించారు. గోకవరం మండలంలోని గుమ్మళ్ళదొడ్డి, అచ్చుతాపురం, గోకవరం తదితర గ్రామాల్లో గురువారం
సబ్ కలెక్టర్ అనుపమ అంజలి
గోకవరం, నవంబరు 12: ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలన్నీ అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ అనుపమ అంజలి అధికారులకు సూచించారు. గోకవరం మండలంలోని గుమ్మళ్ళదొడ్డి, అచ్చుతాపురం, గోకవరం తదితర గ్రామాల్లో గురువారం ఆమె పర్యటించారు. ఆయా గ్రామాల్లో ప్రభుత్వ భవనాల నిర్మాణాలను పరిశీలించి త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. సచివాలయాల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకోవడంతో పాటు రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల అమలు కోసం అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. తహశీల్దార్ కె.పోసిబాబు, ఎంపీడీవో కె.కిషోర్ కుమార్, పంచాయతీ విస్తరణాధికారి రాజేశ్వరరావు, కార్యదర్శులు టి.శ్రీనివాస్, గోపన్నదొర, వీఆర్వోలు ధర్మరాజు, తులసి, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.