పశువులపై వింత జంతువు దాడి

ABN , First Publish Date - 2020-05-24T10:17:43+05:30 IST

పెనికేరులో ఇటీవల వింతజంతువు దాడిచేసి పశువుల దూడలను హతమరుస్తుందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పశువులపై వింత జంతువు దాడి

ఆలమూరు, మే 23: పెనికేరులో ఇటీవల వింతజంతువు దాడిచేసి పశువుల దూడలను హతమరుస్తుందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం పశుసంవర్ధక శాఖ, అటవీ శాఖాధికారులు గ్రామంలో పర్యటించి వివరాలు సేకరించారు. శుక్రవారం రాత్రి టీకే విశ్వనాథంకు చెందిన దూడను చంపి తినేసినట్టు గుర్తించారు.  దూడలను రక్షించాలని పశుసంవర్ధకశాఖ ఏడీ ఒ.రామకృష్ణ అటవీశాఖాధికారులను రైతులు కోరారు. వింతజంతువును పట్టుకోవడానికి ప్రత్యేక బోను ఏర్పాటు చేయాలని సూచించారు. పెనికేరులో నాలుగు దూడలు, జొన్నాడలో ఒక దూడను ఆ జంతువు తినేసిందని ఏడీ చెప్పారు.  

Updated Date - 2020-05-24T10:17:43+05:30 IST