సై్ట్రయిన్‌ వైరస్‌తో అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2020-12-30T05:48:45+05:30 IST

అత్యంత వేగంగా రూపాంతరం చెందుతూ వ్యాపిస్తున్న సై్ట్రయిన్‌ వైరస్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.రాఘవేంద్రరావు కోరారు.

సై్ట్రయిన్‌ వైరస్‌తో అప్రమత్తంగా ఉండాలి

జీజీహెచ్‌ (కాకినాడ), డిసెంబరు 29: అత్యంత వేగంగా రూపాంతరం చెందుతూ వ్యాపిస్తున్న సై్ట్రయిన్‌ వైరస్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.రాఘవేంద్రరావు కోరారు. మంగళవారం ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ సిబ్బందికి కరోనా వైరస్‌ నివారణకు వ్యాక్సిన్‌ వేసేందుకు అవసరమైన శిక్షణ ఇచ్చినట్టు చెప్పారు. సె్ట్రయిన.. కరోనా వైరస్‌ కంటే 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందన్నారు. యుకే నుంచి కాకినాడ వచ్చిన విద్యార్థికి, అతడి తండ్రికి ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్‌ నిర్వహించగా పాజిటివ్‌ వచ్చిందన్నారు. సై్ట్రయిన్‌ కేసులపై ముందస్తు చర్యలుగా మరోసారి మంగళవారం వీరిద్దరికీ సీసీఎంబీ జీనోమ్‌ టెస్ట్‌ నిర్వహించి, శాంపిల్స్‌ను హైదరాబాద్‌ ల్యాబ్‌కు పంపామన్నారు. విద్యార్థి తల్లి, సోదరికి కరోనా నెగెటివ్‌ వచ్చినా ముందస్తుగా వీరిని జీజీహెచ్‌లోని ప్రత్యేక వార్డులో అబ్జర్వేషన్‌లో ఉంచా మన్నారు. బ్రిటన్‌ (యూకే) నుంచి జిల్లాకు వచ్చిన వారి కోసం జీజీహెచ్‌లో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశామని రాఘవేంద్రరావు చెప్పారు.

Updated Date - 2020-12-30T05:48:45+05:30 IST