రేషన్‌ దుకాణాల నుంచి నేరుగా ఇంటికే..

ABN , First Publish Date - 2020-06-23T10:48:16+05:30 IST

రేషన్‌ దుకాణాల నుంచి వాహనాల ద్వారా నిత్యావసర సరుకులను ప్రతి ఇంటికి పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయ, సహకార శాఖ మంత్రి ..

రేషన్‌ దుకాణాల నుంచి నేరుగా ఇంటికే..

రేషన్‌ పంపిణీ వాహనాలను ప్రారంభించిన మంత్రి కన్నబాబు


జేఎన్టీయూకే, జూన్‌ 22: రేషన్‌ దుకాణాల నుంచి వాహనాల ద్వారా నిత్యావసర సరుకులను  ప్రతి ఇంటికి పంపిణీ చేయనున్నట్లు  వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. కాకినాడ జేఎన్టీయూకే మెకానికల్‌ బ్లాక్‌ వద్ద రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీకి సిద్ధం చేసిన వాహనాలను మంత్రి, కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి, జేసీ లక్ష్మీశ, వీసీ రామలింగరాజు,  ప్రొఫెసర్లు పరిశీలించి కొన్ని సూచనలు చేశారు.  పౌర సరఫరాల శాఖ డీఎం లక్ష్మీరెడ్డి, డీఎ్‌సవో ప్రసాద్‌బాబు, జేఎన్టీయూకే రిజిస్ట్రార్‌ సీహెచ్‌ సత్యనారాయణ పాల్గొన్నారు. 

Read more