-
-
Home » Andhra Pradesh » East Godavari » statu remove actoin
-
‘విగ్రహాలు తొలగిస్తే ఉద్యమం తీవ్రం చేస్తాం’
ABN , First Publish Date - 2020-12-27T07:03:27+05:30 IST
స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం తొలగిస్తామని మంత్రి అప్పలరాజు చేసిన వ్వాఖ్యలు వెనక్కి తీసుకోవాలని లేకపోతే ఉద్యామాన్ని తీవ్రం చేస్తామని టీడీపీ నాయకులు హెచ్చరించారు.

పి.గన్నవరం, డిసెంబరు 26:స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం తొలగిస్తామని మంత్రి అప్పలరాజు చేసిన వ్వాఖ్యలు వెనక్కి తీసుకోవాలని లేకపోతే ఉద్యామాన్ని తీవ్రం చేస్తామని టీడీపీ నాయకులు హెచ్చరించారు. పి.గన్నవరం త్రీరోడ్ సెంటర్‌లో శనివారం టీడీపీ మండల అధ్యక్షుడు తొలేటి సత్తిబాబు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు నిరసన చేపట్టారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో సంసాని పెద్దిరాజు, చొల్లంగి సత్తిబాబు, మందపాటి కిరణ్‌కుమార్, కుంపట్ల విష్ణుభగవాన్, శేరు శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు.