రాజమహేంద్రిలో రాష్ట్ర అధికార ప్రతినిధి సమావేశం

ABN , First Publish Date - 2020-10-01T07:38:09+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె.భానుప్రకా్‌షరెడ్డి బుధవారం పార్టీ కార్యాలయంలో నాయకులతో సమావేశం నిర్వహించారు. నగరంలోని 9

రాజమహేంద్రిలో  రాష్ట్ర అధికార ప్రతినిధి సమావేశం

రాజమహేంద్రవరం అర్బన్‌, సెప్టెంబరు 30: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె.భానుప్రకా్‌షరెడ్డి బుధవారం పార్టీ కార్యాలయంలో నాయకులతో సమావేశం నిర్వహించారు. నగరంలోని 9 మండలాల కమిటీలు, మోర్చా కమిటీలు, శక్తి కేంద్రాల ఏర్పాటు, మహాశక్తి కేంద్రాల ఏర్పాటును పరిశీలించడానికి ఆయన ఇక్కడికి వచ్చారు.


ఈ సందర్భంగా మండలాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల నుంచి నివేదికలు తీసుకున్నారు. కార్యక్రమంలో రాజమహేం ద్రవరం పార్లమెంట్‌ అధ్యక్షుడు పరిమి రాధాకృష్ణ, నాయకులు బొమ్ముల దత్తు, కోడూరి లక్ష్మీనారాయణ, క్షత్రియ బాలసుబ్రహ్మణ్యసింగ్‌, అడబాల రామకృష్ణారావు, బూర రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-10-01T07:38:09+05:30 IST