రథం పనులు మొదలు

ABN , First Publish Date - 2020-10-08T07:15:58+05:30 IST

అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయ ప్రాంగణంలో నూతన రథం నిర్మాణ పనుల్లో భాగంగా బుధవారం కలపను చిత్రీపట్టే యంత్రాలకు పూజలు చేసి పని ప్రారంభించారు...

రథం పనులు మొదలు

అంతర్వేది, అక్టోబరు 7: అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయ ప్రాంగణంలో నూతన రథం నిర్మాణ పనుల్లో భాగంగా బుధవారం కలపను చిత్రీపట్టే యంత్రాలకు పూజలు చేసి పని ప్రారంభించారు. పూర్తిస్థాయిలో కలప ఆలయానికి చేరుకుందని ఏడీసీ రామచంద్రమోహన్‌ తెలిపారు. నూతన రథం నిర్మాణ పనులపై సబ్‌కలెక్టర్‌ హిమాన్షుకౌశిక్‌ చర్చించారు. పనుల్లో జాప్యం జరగకుండా చూడాలన్నారు. అనంతరం సబ్‌కలెక్టర్‌ హిమాన్షుకౌశిక్‌తో కలిసి ఏడీసీ రామచంద్రమోహన్‌ స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.  ఆలయ ఏసీ భద్రాజీ, ఇన్‌చార్జి సీఐ సూర్యఅప్పారావు, ఎస్‌ఐ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-08T07:15:58+05:30 IST