శ్రీరామ రక్షాస్తోత్రం, లలితా సహస్రనామం పుస్తకావిష్కరణ
ABN , First Publish Date - 2020-10-08T05:39:14+05:30 IST
దేవీచౌక్ రోడ్‌లో గాడాల పీఠం నగర కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం శ్రీరామ రక్షాస్తోత్రం, లలితా సహస్రనామం పుస్తకావిష్కరణ జరిగింది...

గోదావరి సిటీ, అక్టోబరు 7: ప్రతి ఇంట్లో లలిత సహస్రనామ పారాయణం జరగాలని గాడాల శ్రీమహాలక్ష్మీ సమేత చిన్న వేంకన్నబాబు పీఠం పీఠాధిపతి చిన్న వేంకన్నబాబు అన్నారు. దేవీచౌక్ రోడ్‌లో గాడాల పీఠం నగర కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం శ్రీరామ రక్షాస్తోత్రం, లలితా సహస్రనామం పుస్తకావిష్కరణ జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్రలోని దత్తుడుగారి శ్రీసీతారామాలయం సౌజన్యంతో స్టేట్‌బ్యాంక్ విశ్రాంత అధికారి తోలేటి లక్ష్మణరావు సంకలనం చేసిన ఈ పుస్తకాన్ని గాడాల పీఠాధిపతి చిన్న వేంకన్నబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరామ రక్షాస్తోత్రం, లలితా సహస్రనామం రెండింటినీ ఒకే సంచికలో అందించిన తోలేటి లక్ష్మణరావు అభినందనీయులన్నారు. కార్యక్రమంలో మన గుడి, మన సేవ చైర్‌పర్సన్ హైమావతి పాల్గొన్నారు.