స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో దాడులు

ABN , First Publish Date - 2020-08-12T11:12:24+05:30 IST

స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఏఎస్పీ రమాదేవి ఆదేశాల మేరకు మంగళవారం దివాన్‌చెరువు, నందరాడ, కానవరం ప్రాంతాల్లో దాడులు..

స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో దాడులు

రాజమహేంద్రవరం సిటీ, ఆగస్టు 11: స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఏఎస్పీ రమాదేవి ఆదేశాల మేరకు మంగళవారం దివాన్‌చెరువు, నందరాడ, కానవరం ప్రాంతాల్లో దాడులు చేశారు.  600లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. దివాన్‌చెరువుకు చెందిన సురేష్‌ నుంచి 15లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. మత్తుకు అలవాటుపడిన కొంతమంది  శానిటైజర్లు తాగుతున్నందున కొన్ని మెడికల్‌ షాపుల వద్ద సౌత్‌స్టేషన్‌ సీఐ గిరిజా సత్యకుమారి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. షాపులు తనిఖీలు చేసి అనంతరం శానిటైజర్లు అమ్మేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని వారికి సూచించారు.

Updated Date - 2020-08-12T11:12:24+05:30 IST