పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు
ABN , First Publish Date - 2020-11-16T05:18:13+05:30 IST
ఏలేశ్వరం, నవంబరు 15: కార్తీక మాసాన్ని పురష్కరించుకుని రాష్ట్రంలోని ప్రముఖ శైవ, పంచారామ పుణ్యక్షేత్రాల దైవదర్శనం కల్పించేందుకు ఏలేశ్వరం ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు మేనేజర్ హెచ్.అమరసింహుడు తెలిపారు. ఇందుకు సంబంధించిన

ఏలేశ్వరం, నవంబరు 15: కార్తీక మాసాన్ని పురష్కరించుకుని రాష్ట్రంలోని ప్రముఖ శైవ, పంచారామ పుణ్యక్షేత్రాల దైవదర్శనం కల్పించేందుకు ఏలేశ్వరం ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు మేనేజర్ హెచ్.అమరసింహుడు తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలు, పోస్టర్‌లను ఆదివారం ఆయన ఆవిష్కరించి మండలంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంచారామ పుణ్యక్షేత్రాలైన అమరావతిలోని అమరలింగేశ్వరుడు, భీమవరంలోని సోమేశ్వరస్వామి, పాలకొల్లులోని శ్రీ క్షీరరామలింగేశ్వరస్వామి, ద్రాక్షారామలో భీమేశ్వరస్వామి, సామర్లకోటలో కుమార భీమేశ్వరస్వామిని దర్శించుకునేందుకు బస్సు సర్వీసులు నడపనున్నామన్నారు. నవంబరు 22, 29, డిసెంబరు 6, 13 తేదీల్లో ఏలేశ్వరం డిపో నుంచి రాత్రి 8గంటలకు ఆయా క్షేత్రాలకు బస్సులు వెళతాయన్నారు. ఆల్ర్టా డీలక్స్ బస్సుకు పెద్దలకు రూ.895, పిల్లలకు రూ.690 వంతున, సూపర్ లగ్జరీ బస్సుకు పెద్దలకు రూ.945, పిల్లలకు రూ.720 వంతున, ఎక్స్‌ప్రెస్ బస్సుకు పెద్దలకు రూ.770, పిల్లలకు రూ.585 వంతున చార్జీలు ఉంటాయని తెలిపారు. వివరాలకు 9959225 532, 7382911993, 08868224112లో సంప్రదించాలని కోరారు.