గాంధీ సిద్ధాంతాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి: ఎస్పీ నయీం అస్మీ
ABN , First Publish Date - 2020-10-03T07:33:05+05:30 IST
గాంధీ సిద్ధాంతాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ కోరారు

కాకినాడ క్రైం, అక్టోబరు 2: గాంధీ సిద్ధాంతాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ కోరారు. జాతిపిత మహాత్మాగాంధీ 151వ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయ సెంట్రలు హాలులో శుక్రవా రం ఆయన చిత్రపటానికి ఎస్పీ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అహింసావాదంతోనే గాంధీ స్వాతంత్య్రం సాధించారన్నారు.
ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఆరోగ్యవంతమైన సమాజస్థాపనకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఈబీ అడిషనల్ ఎస్పీ గరుడ్ సుమిత్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ వీఎస్ ప్రభాకరరావు, అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.కుమార్, ఎస్‌బీ డీఎస్పీలు ఎం. అంబికాప్రసాద్, ఎస్.మురళీమోహన్, ఏఆర్ డీఎస్పీ ఎస్వీ అప్పారావు, స్పెషల్ బ్రాంచి ఇన్‌స్పెక్టర్ నక్కా రజనీకుమార్, ఎ-సెక్షన్ సూపరింటెండెంట్ కె.అనిల్‌జాన్సన్, డీపీవో బి.వినయ్ తదితరులు పాల్గొన్నారు.
జీజీహెచ్ (కాకినాడ): మహాత్మాగాంధీ జయంతిని జీజీహెచ్‌లో ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏడీ సుమైలా, ఏవో షాన్వాజ్‌ఖాన్, ఆర్‌ఎంవోలు డాక్టర్ గిరిధర్, డాక్టర్ దీప్తి, ఎన్జీవో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాస్, మిని స్టీరియల్ స్టాఫ్ అధ్యక్షుడు పాలపర్తి మూర్తిబాబు, నర్సింగ్ సూపరింటెండెంట్ అక్కమ్మ, శానిటేషన్ కాంట్రాక్టర్ గోకేడ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.