సమాజంలో మహిళలకు గౌరవం కల్పించిన సీఎం

ABN , First Publish Date - 2020-12-27T06:35:31+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా పేద మహిళలకు ఇళ్ల స్థలా లు మంజూరుచేసి, పట్టాలు ఇవ్వడం ద్వారా మహిళలకు సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కల్పించారని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు.

సమాజంలో మహిళలకు గౌరవం కల్పించిన సీఎం

 ఉపముఖ్యమంత్రి కృష్ణదాస్‌

సీతానగరం, డిసెంబరు 26: రాష్ట్రవ్యాప్తంగా పేద మహిళలకు ఇళ్ల స్థలా లు మంజూరుచేసి, పట్టాలు ఇవ్వడం ద్వారా మహిళలకు సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కల్పించారని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. శనివారం చినకొండేపూడి గ్రామంలో రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆఽధ్యక్షతన జరిగి ఇళ్ల స్థలాలకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 30లక్షల ఇళ్లు మంజూరు చేశామన్నారు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా జగన్మోహన్‌రెడ్డి విద్య, వైద్య, వ్యవసాయరంగాలలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ నియోజకవర్గంలో 20వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేశామన్నారు. ఈ స్థలాలకు విద్యుత్‌, మంచినీరు, రోడ్లు, డ్రైనేజీలు, తదితర మౌలిక సదుపా యాలు కల్పించామన్నారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌ ఎంపీడీవో రమేష్‌, తహసీల్దార్‌ శివమ్మ, ముదునూరి రామకృష్ణరాజు, చేకూరి సత్తిపండురాజు, డాక్టర్‌బాబు, గోపిశెట్టి అచ్చారావు, ముసునూరి వీరబాబు, కొంచ చంద్రభాస్కరరావు, వడ్లమూరు సోమరాజు, మట్ట వసంతరావు, కోండ్రపు ముత్యాలు, ద్వారంపూడి రామకృష్ణ, రాజు పాల్గొన్నారు Updated Date - 2020-12-27T06:35:31+05:30 IST