స్మార్ట్ సిటీ నిధులతో పాఠశాలల అభివృద్ధి
ABN , First Publish Date - 2020-11-03T06:30:29+05:30 IST
స్మార్ట్ సిటీ నిధులతో నగరంలోని పాఠశాలలను అభివృద్ధి చేయనున్నట్టు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు.
- కమిషనర్ దినకర్ పుండ్కర్
కార్పొరేషన్(కాకినాడ), నవంబరు 2: స్మార్ట్ సిటీ నిధులతో నగరంలోని పాఠశాలలను అభివృద్ధి చేయనున్నట్టు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. సోమవారం స్థానిక 40వ డివిజన్‌లోని జడ్పీ ఓరియంటల్ హైస్కూల్‌ను పరిశీలించారు. ఈ స్కూల్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేయాలని స్థానిక కార్పొరేటర్ సుంకర శివప్రసన్న కమిషనర్‌ను కోరగా సానుకూలంగా స్పందించి స్కూల్‌ను సందర్శించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను తొలగించి స్మార్ట్ సిటీ నిధులతో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో 10వ తరగతిలో రెండో భాషగా సంస్కృతం ఉన్న పాఠశాల ఇదేనని కమిషనర్‌కు వివరించారు. కార్యక్రమంలో డివిజన్ ఇన్‌చార్జి సుంకర సాగర్, డీఈ సుబ్బారావు, ఏఈ విరూపాక్షం పాల్గొన్నారు.