స్మార్ట్ సిటీ నిధులు దుర్వినియోగం
ABN , First Publish Date - 2020-11-03T06:28:39+05:30 IST
రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా, అధికారులు మారినా కాకినాడ స్మార్ట్ సిటీ నిధుల దుర్వినియోగం మాత్రం ఆగడం లేదని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ ఆరోపించారు.
- బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి రవికిరణ్
కార్పొరేషన్(కాకినాడ), నవంబరు 2: రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా, అధికారులు మారినా కాకినాడ స్మార్ట్ సిటీ నిధుల దుర్వినియోగం మాత్రం ఆగడం లేదని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ ఆరోపించారు. కాకినాడ బాలాజీచెరువు సెంటర్‌లోని సిటీ నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల శిక్షణా తరగతులను బీజేపీ యువ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సాలగ్రామ లక్ష్మీప్రసన్న అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన రవికిరణ్ మాట్లాడుతూ నవంబరులో కాకినాడ సిటీ నియోజకవర్గం మండల నాయకులకు జరగబోయే శిక్షణా తరగతుల నిర్వహణ, విధి విధానాలను రాష్ట్ర అధ్య క్షుడు సోము వీర్రాజు ఇచ్చిన దిశ నిర్దేశాన్ని నాయకులకు వివరించారు. ప్రతి కార్యకర్త కేంద్ర పథకాలపై అవగాహన పెంచుకుని వాటిని ప్రజలకు చేరేలా పని చేయాలని లక్ష్మీప్రసన్న వివరించారు. కార్యక్రమంలో యెనిమిరెడ్డి మాలకొండయ్య, ప్రముఖ్ కళ్యాణ్‌కుమార్ పాల్గొన్నారు.