విద్యుత్ శాఖ ప్రైవేటీకరణను అడ్డుకోవాలి
ABN , First Publish Date - 2020-12-05T06:59:43+05:30 IST
విద్యుత్‌శాఖ ప్రైవేటీకరణను నిరసిస్తూ యానాం విద్యుత్ శాఖ ఉద్యోగులు విధులు బహిష్కరించి శుక్రవారం ఉదయం కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.

విద్యుత్ శాఖ ఉద్యోగుల ఆందోళన
యానాం, డిసెంబరు 4: విద్యుత్‌శాఖ ప్రైవేటీకరణను నిరసిస్తూ యానాం విద్యుత్ శాఖ ఉద్యోగులు విధులు బహిష్కరించి శుక్రవారం ఉదయం కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. పుదుచ్చేరి రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అందోళనకు యానాం ఉద్యోగులు మద్దతు తెలిపారు. విద్యుత్ శాఖను ప్రైవేటీకరణ చేస్తే కలిగే నష్టాలను పలువురు ఉద్యోగులు వివరించారు. కార్యక్రమంలో యానాం విద్యుత్‌శాఖ సిబ్బంది పాల్గొన్నారు.