తీరంలో ఇసుక లారీలను అడ్డుకున్న ఎస్‌ఐ

ABN , First Publish Date - 2020-10-07T09:00:09+05:30 IST

కొమరగిరిపట్నం నుంచి తువ్వ ఇసుకను తరలి స్తున్న ఇసుక లారీలను ఎస్‌ఐ బి.ప్రభాకరరావు మంగళవారం అడ్డుకున్నారు...

తీరంలో ఇసుక లారీలను అడ్డుకున్న ఎస్‌ఐ

అల్లవరం, అక్టోబరు 6:  కొమరగిరిపట్నం నుంచి తువ్వ ఇసుకను తరలి స్తున్న ఇసుక లారీలను ఎస్‌ఐ బి.ప్రభాకరరావు మంగళవారం అడ్డుకున్నారు. ఇసుక లారీలు తిరగడం వల్ల రోడ్లు దెబ్బతింటున్నాయని గ్రామస్థులు ఎస్‌ఐకు ఫిర్యాదు చేశారు. మైన్స్‌ శాఖ నుంచి అనుమతులు పొంది కొమ రగిరిపట్నం నుంచి తువ్వ ఇసుకను లారీలతో తరలిస్తున్నారు. రోడ్లు పాడవ ుతున్నందున సదరు వాహనదారులు ఇసుక తోలకాలను ఆపివేయాలని ఎస్‌ఐ వెళ్లి తవ్వకాలను అడ్డుకున్నారు. ఒక ఇసుక లారీని పోలీసులు స్టేషన్‌ వద్ద నిలిపివేశారు. 

Read more