భవన నిర్మాణ కార్మికులను అడ్డుకున్న పోలీసులు
ABN , First Publish Date - 2020-10-02T08:27:33+05:30 IST
సమస్యల పరిష్కారం కోసం ఛలో కలెక్టరేట్‌కు బయలుదేరిన భవన నిర్మాణ కార్మికులు పలువురిని అదుపులోకి ..
పెద్దాపురం, అక్టోబరు 1: సమస్యల పరిష్కారం కోసం ఛలో కలెక్టరేట్‌కు బయలుదేరిన భవన నిర్మాణ కార్మికులు పలువురిని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్ఐ ఏ.బాలాజీ తెలిపారు. ఆటోలో వెళుతున్న భవన నిర్మాణ కార్మికులను స్థానిక సుధా ఫ్యాక్టరీ వద్ద నిలిపివేసి, స్టేషన్‌కు తరలించినట్టు తెలిపారు.