భీమక్రోసుపాలెంలో రొయ్యల చెరువులు తొలగించాలి

ABN , First Publish Date - 2020-10-07T08:48:29+05:30 IST

రామచంద్రపురం మం డలం భీమక్రోసుపాలెం గ్రామంలో రొయ్యల చెరువులు పూర్తిగా తొలగించాలని ఏఐకేఎంఎస్‌ జిల్లా అధ్యక్షుడు జె.సత్తిబాబు డిమాండ్‌ చేశారు...

భీమక్రోసుపాలెంలో రొయ్యల చెరువులు తొలగించాలి

ద్రాక్షారామ, అక్టోబరు 6: రామచంద్రపురం మం డలం భీమక్రోసుపాలెం గ్రామంలో రొయ్యల చెరువులు పూర్తిగా తొలగించాలని ఏఐకేఎంఎస్‌ జిల్లా అధ్యక్షుడు జె.సత్తిబాబు డిమాండ్‌ చేశారు. మంగళవారం భీమక్రోసుపాలెంలో రొయ్యల చెరువులు సాగుకు వ్యతిరేకంగా డివిజన్‌ కార్యదర్శి వి.భీమశంకరం అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రజల ఉపాధిని, ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని దెబ్బతీసే రొయ్యల చెరువుల సాగును ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. గ్రామంలో గతంలో మూసివేసిన 15ఎకరాలు రొయ్యల చెరువుల సాగును తిరిగి కొనసాగించేందుకు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తిరిగి ప్రారంభం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు.గనిరాజు, ఏపీఎస్‌ఆర్‌టీసీ యునైటెడ్‌ వర్కర్స్‌ యూనియన్‌ కేంద్ర నాయకులు గాంధీ రాజు, ఏఐకేఎంఎస్‌ డివిజన్‌ అధ్యక్షుడు రవివర్మ, పీడీఎస్‌యు నాయకులు పి.శ్రీను మాట్లాడారు. గ్రామ సంఘం నాయకులు కమిడి చంద్రరావు, కె.సింహాద్రి, బి.మేరీ, గుండుపల్లి మంగమ్మ పాల్గొన్నారు.

Read more