ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

ABN , First Publish Date - 2020-10-01T07:24:05+05:30 IST

గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జాయింట్‌ కలెక్టర్‌-2 రాజకుమారి ఆదేశించారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

జేసీ2


తొండంగి, సెప్టెంబరు 30: గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జాయింట్‌ కలెక్టర్‌-2 రాజకుమారి ఆదేశించారు. బుధవారం ఆమె తొండంగి గ్రామ సచివాలయాలను తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పరిశీలించారు. వీఆర్‌వో హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


అనంతరం ఆమె మండల పరిషత్‌ కార్యలయంలో సమీక్ష నిర్వహించారు. ఇళ్ల స్థలాల పంపిణీకి సిద్ధం చేయాలన్నారు. ఆర్‌డీవో మల్లిబాబు, తహశీల్దార్‌ చిన్నారావు, ఎంపీడీవో సతీష్‌ పాల్గొన్నారు.


Updated Date - 2020-10-01T07:24:05+05:30 IST