షూటింగ్‌ షురూ !

ABN , First Publish Date - 2020-10-07T10:14:43+05:30 IST

అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్‌ సహకారంతో రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో ఓ సినిమా రూపొందుతుంది...

షూటింగ్‌ షురూ !

రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 6: అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్‌ సహకారంతో రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో ఓ సినిమా రూపొందుతుంది. ఈ షూటింగ్‌ను మంగళవారం హర్షకుమార్‌ క్లాప్‌ కొట్టి ప్రారంభించారు. రెండు గంటల వ్యవధితో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నగరానికి చెందిన రాజ్‌కుమార్‌ చీపురు దర్శకుడు, సినిమాటోగ్రఫీ వెంకటేష్‌ చింతాకుల, బొమ్మూరుకు చెందిన సల్మాన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌, జగ్గంపేటకు చెందిన పినాగేంద్ర ఎడిటింగ్‌, సౌండ్‌ ఇంజినీయర్‌ నవనీత్‌ చారి. చిత్ర కథను హర్షకుమార్‌ తనయుడు జీవి శ్రీరాజ్‌ అందించగా, నిర్మాతగా హర్షకుమార్‌ కోడలు అనిత వ్యవహరిస్తున్నారు. సినిమా పేరును ఇంకా నిర్ణయించలేదు. ఇది పూర్తిగా యాక్షన్‌ సినిమా చిత్రమని, హైదరాబాద్‌పై ఆధారపడకుండా రూపొందిస్తున్నామని జీవి శ్రీరాజ్‌ చెప్పారు. ట్రైలర్‌ను ఈనెల 23న హర్షకుమార్‌ పుట్టినరోజు సందర్భం గా విడుదల చేస్తామని ఆయ న తెలిపారు.

Read more