మార్పు..!

ABN , First Publish Date - 2020-09-06T10:12:27+05:30 IST

ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్‌లో పలు మార్పులు జరగనున్నాయి. ప్రస్తుత విద్యా ప్రమాణాలను మరింత బలోపేతం చేయడానికి ఇంటర్‌ బోర్డు సంస్కరణలను తీసుకురానుంది. నేషనల్‌ కౌన్సెల్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌

మార్పు..!

  • ఇంటర్‌ విద్యలో సంస్కరణలు
  • సీబీఎస్‌ఈ తరహాలో పరీక్షలు 
  • ప్రశ్నలెక్కువ, మార్కులు తక్కువ   
  • ఎంసెట్‌, జేఈఈ, నీట్‌కు శిక్షణ 
  • అడ్మిషన్లు, ఫీజు ఆన్‌లైన్‌లోనే
  • సీట్ల కేటాయింపులో రిజర్వేషన్లు
  • కొవిడ్‌ దృష్ట్యా ఒక్కో సెక్షన్‌లో 40 మంది విద్యార్థులు.
  • ఈ ఏడాది నుంచి కొత్త పద్ధతి అమలు


(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్‌లో పలు మార్పులు జరగనున్నాయి. ప్రస్తుత విద్యా ప్రమాణాలను మరింత బలోపేతం చేయడానికి ఇంటర్‌ బోర్డు సంస్కరణలను తీసుకురానుంది. నేషనల్‌ కౌన్సెల్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సీఈఆర్‌టీ) సూచనలతో అడ్మిషన్లు, ఫీజుల చెల్లిం పు, పనివేళలు, బోధన, కళాశాల నిర్వహణ, ప్రశ్నాపత్రాల విష యంలో సమగ్ర మార్పులు చోటుచేసుకోనున్నాయి. అడ్మిషన్లు, ఫీజుల చెల్లింపులు అన్నీ ఆన్‌లైన్‌లోకి తీసుకువస్తారు. ఇంటర్‌ చదువుతుండగానే విద్యార్థుల్లో ఉన్నత చదువుల పట్ల ఆకాంక్ష,  పోటీ పరీక్షల్లో సత్తా చూపే ప్రతిభ పాటవాలకు అవసరమైన అవగాహన, శిక్షణ ఇస్తారు. తరగతి గదుల్లో విద్యార్థులు కొవిడ్‌ బారిన పడకుండా భౌతిక దూరం పాటించడానికి ఒక్కో తరగ తిలో 40 మంది విద్యార్థులకు మాత్రమే అడ్మిషన్లు ఇస్తారు. విద్యార్థుల పురోగతిని ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు చేరవేయ డానికి వెబ్‌సైట్‌ రూపొందిస్తారు. ఇదంతా ఈ అకాడమిక్‌ సంవ త్సరం నుంచి అమలు చేయనున్నారు. కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఉన్నత విద్యా ప్రమాణాలతో విద్యార్థులకు పాఠాలు బోధించను న్నారు. జిల్లాలో ప్రభుత్వ కళాశాలలు 42, ఎయి డెడ్‌ 13, ప్రైవేట్‌, కార్పొరేట్‌ కళాశాలలు 226 ఉన్నా యి.


గత విద్యా సంవత్సరంలో ఇంటర్‌ ప్రథమ ఏడాది  43,000, ద్వితీయ ఏడాది 44,000 మంది చదివారు. వీరికి ఫైనల్‌ పరీక్షలు పూర్తయ్యి ఫలి తాలు కూడా వెల్లడయ్యాయి. ఈ ఏడాది నుంచి ఇంటర్‌ బోర్డు కీలక మార్పులు చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. సెంట్రల్‌ బోర్డు సెకండరీ ఎడ్యు కేషన్‌ (సీబీఎస్‌ఈ) మాదిరిగా ప్రశ్నల సంఖ్య పెంచి మార్కులను తగ్గించనుంది. అన్ని సబ్జెక్టుల పై విద్యార్థులకు నూరుశాతం అవగాహన కల్పించ డానికి కార్యాచరణ తయారు చేస్తోంది. దీంతో ఎం సెట్‌, జేఈఈ, నీట్‌కు సంబంధించి పోటీ పరీక్షల కు సమాయత్తమయ్యేలా విద్యార్థులను తీర్చిదిద్ద నుంది. పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే కళాశాలలు, సంస్థలు ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఫీజు నిర్ణయించే బాధ్యత పాఠశాల విద్య నియం త్రణ,పర్యవేక్షక కమిషన్‌కు బోర్డు అప్పగించనుంది. ఇక మార్పు ఎలాగంటే.. అడ్మిషన్లు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. సీట్ల కేటాయింపులో రిజర్వేషన్‌ పక్కాగా అమలు చేస్తారు. కళాశాలల పనివేళలను మారుస్తారు. ఉదయం 8.30 నుంచి సాయంత్రం 3.30 వరకు తరగతులు నిర్వహిస్తారు. అనంతరం ఒక గంట క్రీడలు, ఇతర అంశాలపై శిక్షణ ఇస్తారు. మొన్నటి వరకు ఒక్కో సెక్షన్‌కు 80 నుంచి 82 మంది విద్యార్థులుండేవారు. ఇక నుంచి 40 మందికి మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. కళాశా లలో 9 సెక్షన్‌లకు మించకుండా నిర్ణయం తీసుకో నున్నారు.


దీంతో ప్రతీ కళాశాలలో 360 మంది విద్యార్థులు ఉంటారు. ఇప్పటివరకు ప్రైవేట్‌ కళా శాలల్లో 4 సెక్షన్‌లు ఉంటుండగా, అదనంగా మరో 5 సెక్షన్‌లు పెంచుతారు. ఈ సెక్షన్‌ల నిర్వహణలో పూర్తి స్థాయి సౌకర్యాలు నిబంధనలకనుగుణంగా లేకపోతే కళాశాల నడపడానికి అనుమతి నిరాకరి స్తారు. తనిఖీల ద్వారా అధ్యాపకుల బోధన, వారి నోట్స్‌, విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలిస్తారు. ప్రభు త్వ జూనియర్‌ కళాశాలల్లో తక్కువ మంది చేరు తున్న గ్రూపులను ఎత్తేయాలని భావిస్తున్నారు. అధ్యాపకులను ఎక్కువ మంది విద్యార్థులున్న కళా శాలలకు కేటాయిస్తారు. ఇష్టానుసారం ఫీజులు వసూలు చేసే ప్రైవేట్‌, కార్పొరేట్‌ కళాశాలల యా జమాన్యాలపై శాఖాపరమైన చర్యలు తీసుకోను న్నారు. ఫిర్యాదులు అందితే రెగ్యులేటరీ కమిషన్‌ కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇదిలా ఉంటే వార్షిక కేలండర్‌లో సెలవులను కుదించనున్నారు. 

Updated Date - 2020-09-06T10:12:27+05:30 IST