క్షేత్రస్థాయిలో సేవలకే ప్రథమ స్థానం

ABN , First Publish Date - 2020-10-07T08:54:36+05:30 IST

క్షేత్రస్థాయిలో అఽధి కారులు, సిబ్బంది అందించిన సేవలకు అమలాపురం డివిజన్‌ ప్రథమస్థానంలో నిలిచిందని సబ్‌కలెక్టర్‌ హిమాన్షుకౌశిక్‌ అన్నారు...

క్షేత్రస్థాయిలో సేవలకే ప్రథమ స్థానం

అమలాపురం, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): క్షేత్రస్థాయిలో అఽధి కారులు, సిబ్బంది అందించిన సేవలకు అమలాపురం డివిజన్‌ ప్రథమస్థానంలో నిలిచిందని సబ్‌కలెక్టర్‌ హిమాన్షుకౌశిక్‌ అన్నారు.  అమలాపురం సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం ఎంపీ డీవోలు, తహశీల్దార్లతో నిర్వహించిన సమావేశంలో వారిని అభినం దిస్తూ హిమాన్షుకౌశిక్‌ మాట్లాడారు.  భూమి రికార్డుల స్వచ్ఛీకరణలో తహశీల్దార్లు దృష్టి సారించాలన్నారు. ఈనెల10 నుంచి గ్రామ స్థాయిలో భూమి సర్వే కార్యక్రమం జరుగుతుందని, ఈనెల9లోపు డేటా నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. అనం తరం సబ్‌కలెక్టర్‌ హిమాన్షుకౌశిక్‌ను ఉద్యోగులు సత్కరించారు. కార్యాలయ పరిపాలనాధికారి జవ్వాది వెంకటేశ్వరి, డిప్యూటీ ఇన్‌ స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే సత్తి నాగేశ్వరరావు, ఉపగణాంక అధికారి ఎ.ప్రభు దాస్‌, ఏఎస్‌వో జె.ఆనందబాబు, డిప్యూటీ తహశీల్దార్‌ భాస్కర్‌, వివిధ మండలాల అధికారులు పాల్గొన్నారు. 

Read more