-
-
Home » Andhra Pradesh » East Godavari » seminor
-
27న ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌పై సెమినార్
ABN , First Publish Date - 2020-11-21T05:48:35+05:30 IST
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ ఇన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే అంశంపై ఈ నెల 27న అంతర్జాతీయ సెమినార్‌ను ఆనలైన ద్వారా నిర్వహిస్తున్నామని ఉపకులపతి ఆచార్య మొక్కా జగన్నాథరావు అన్నారు.

- ‘నన్నయ’ వీసీ జగన్నాథరావు
దివానచెరువు, నవంబరు 20: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ ఇన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే అంశంపై ఈ నెల 27న అంతర్జాతీయ సెమినార్‌ను ఆనలైన ద్వారా నిర్వహిస్తున్నామని ఉపకులపతి ఆచార్య మొక్కా జగన్నాథరావు అన్నారు. దీనికి సంబంధించిన బ్రోచర్‌ను విశ్వవిద్యాలయంలో శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడు తూ ఉచిత రిజిసే్ట్రషనతో ఈ సెమినార్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను గాని, కన్వీనర్ మెయిల్‌ను గాని సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో రిజిసా్ట్రర్ ఆచార్య బట్టు గంగారావు, ప్రిన్సిపాల్ వి.పెర్సిస్, విభాగాధిపతి పి.వెంకటేశ్వరరావు, కన్వీనర్ టి.త్రిత్వజ్యోతికిరణ్, కో-కన్వీనర్ ఎం.శ్రీనివాసరావు, లీగల్ అధికారి నందెపు నాగేంద్రరావు పాల్గొన్నారు.