ఈవోపీఆర్డీలు, గ్రామ కార్యదర్శులకు శిక్షణ

ABN , First Publish Date - 2020-11-27T06:25:09+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగులు వ్యక్తిత్వం, విశ్వనీయత తప్పనిసరిగా కలిగి ఉండాలని గ్రామ సచివాలయ వ్యవస్థల సంయుక్త సంచాలకులు(శిక్షణలు) ఎం.సురేష్‌ అన్నారు.

ఈవోపీఆర్డీలు, గ్రామ కార్యదర్శులకు శిక్షణ

రంపచోడవరం, నవంబరు 26: ప్రభుత్వ ఉద్యోగులు వ్యక్తిత్వం, విశ్వనీయత తప్పనిసరిగా కలిగి ఉండాలని గ్రామ సచివాలయ వ్యవస్థల సంయుక్త సంచాలకులు(శిక్షణలు) ఎం.సురేష్‌ అన్నారు. గురువారం ఆయన స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో రంపచోడవరం, చింతూరు ఐటీడీఏలకు చెందిన ఈవోపీఆర్డీలు, గ్రామ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి-1964, సీపీఏ రూల్స్‌పై శిక్షణ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థలను ప్రవేశపెట్టి పథకాల వర్తింపు, సర్వీసు సేవలను ప్రజలకు సులభతరం చేస్తోం దన్నారు. ఆర్డీవో శీనా నాయక్‌ మాట్లాడుతూ ఉద్యోగులు ప్రజలకు అంకితభావంతో నిస్వార్థంగా సేవలందించాలన్నారు. ఉద్యోగ పరిధిలోని చట్టాలు, నిభందనలు పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవోలు ఎ.లక్ష్మారెడ్డి, బాపన్నదొర, నాగేంద్ర, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-27T06:25:09+05:30 IST