మెరుగైన సేవల కోసం సచివాలయ వ్యవస్థ

ABN , First Publish Date - 2020-10-07T10:12:52+05:30 IST

ప్రజలకు మెరుగైన సేవలందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టిందని వైసీపీ రూరల్‌ కోఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు అన్నారు...

మెరుగైన సేవల కోసం సచివాలయ వ్యవస్థ

వైసీపీ రూరల్‌ కోఆర్డినేటర్‌ ఆకుల 


కడియం, అక్టోబరు 6: ప్రజలకు మెరుగైన సేవలందించాలనే ఉద్దేశంతో  ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టిందని వైసీపీ రూరల్‌ కోఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు అన్నారు. మంగళవారం ఆయన ఎంపీడీవో ఈ. మహే్‌షతో కలిసి మండలంలో కడియం, కడియపుసావరం, జేగురుపాడు గ్రామాల్లో జరుగుతున్న సచివాలయ భవనాల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ సచివాలయ భవనాలతో పాటు రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ క్లినిక్‌లు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు ఉండేలా చూస్తూ వేగంగా పూర్తిచేసేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని ఎంపీడీవోకు సూచించారు. 

Read more