పాఠశాలలు తెరుస్తున్నారు

ABN , First Publish Date - 2020-07-28T11:28:21+05:30 IST

జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను ఈ నెలాఖరు వరకు, వచ్చే నెల మొదటి వారంలోనూ తెరవాలని ప్రభుత్వం ఆదేశించింది.

పాఠశాలలు తెరుస్తున్నారు

అడ్మిషన్లు ఇస్తారు.. సెప్టెంబరు వరకు విద్యార్థులు వెళ్లరు

ప్రభుత్వ అనుమతి వచ్చే వరకు ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజులు వసూలుకు నో  

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు హాజరవ్వాల్సిందే 


(కాకినాడ-ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను ఈ నెలాఖరు వరకు, వచ్చే నెల మొదటి వారంలోనూ  తెరవాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే గత ఏడాది అడ్మిషన్ల సంఖ్య 3.90 లక్షల కంటే అదనంగా పిల్లలను చేర్చుకోవాలని సూచించింది. అలాగే ప్రైవేట్‌ పాఠశాలలను తెరుచుకోవచ్చని, అడ్మిషన్లు ఇచ్చుకోవచ్చని, కాని పిల్లల నుంచి ఎటువంటి ఫీజులు వసూలు చేయకూడదని పేర్కొంది. వచ్చే సెప్టెంబరు నెలలో తరగతులు నిర్వహించే వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థులకు మాత్ర మే ఆన్‌లైన్‌ పాఠ్యాంశాలకు అనుమతి ఇచ్చింది. ఈ నిబంధన ప్రైవేట్‌ పాఠశాలలకు వర్తించదని స్పష్టం చేసింది. దీంతో ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి. అయితే ఇప్పుడున్న అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా ప్రైవేట్‌ యాజమాన్యాలు కొంతకాలం వేచి చూడాలని ప్రభు త్వం వెల్లడించింది. 


కొవిడ్‌ వైరస్‌ ఉధృతి కొనసాగుతున్నా, లాక్‌డౌన్‌ తర్వాత నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాద్యాయులు విడతల వారీ విధులకు హాజరవుతున్నారు. నాడు-నేడు పనులు, ఆన్‌ లైన్‌ తరగతుల నిర్వహణలో నిమగ్నమవుతున్నారు. ఇక నుంచి 2020-21 విద్యా సంవత్సరంపై దృష్టి సారించనున్నారు. సెప్టెంబరు 4వ తేదీ వరకు పాఠశాలలు పునఃప్రారంభించడానికి అవకాశం లేనం దున, విద్యార్థుల్లో సామర్ధ్యాల పెంపు కోసం 40 రోజులపాటు ప్రత్యామ్నాయ బోధనకు సంసిద్ధులు కానున్నారు. కొవిడ్‌ ప్రభావంతో వార్షిక పరీక్షలు లేకుండానే టెన్త్‌ విద్యార్థులను ప్రభుత్వం పాస్‌ చేసింది. ఇదే పద్ధతిలో 6 నుంచి 9 విద్యార్థులను ప్రమోట్‌ చేస్తోంది. జిల్లాలో అన్ని యాజమాన్యాల్లో సుమారు 6 వేల పాఠశాలలున్నాయి. వీటిలో సుమారు 5.80 లక్షల మంది విద్యార్థులు చదువుతు న్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు సుమారు 21 వేల మంది ఉన్నారు.


వీరిలో కొందరు కొవిడ్‌ ప్రభావం వల్ల హోం టు వర్క్‌లో పనిచేస్తున్నారు. తదనుగుణంగా ప్రభుత్వ విద్యా లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ నేపథ్యంలో డీఈవో అబ్రహం మాట్లాడుతూ స్టేట్‌ కౌన్సెల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌, ట్రైనింగ్‌ (ఎస్‌సీఈఆర్‌టీ) ఇచ్చిన కాలెండర్‌ మేరకు అన్ని యాజ మాన్యాలు పాఠ్యంశాల బోధనకు బద్ధులై ఉండాలన్నారు. అడ్మిషన్‌లు ఎప్పటికపుడు వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని,. ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు గైడ్‌లైన్స్‌ వక్రీకరిస్తే చర్యలు తప్పవని, ప్రవేశాలిచ్చినా ఫీజు వసూలు చేయకూడదని ఆయన హెచ్చరించారు.

Updated Date - 2020-07-28T11:28:21+05:30 IST