ఆ ఐదు పాఠశాలల్లో అడ్మిషన్లు ఆపండి..!
ABN , First Publish Date - 2020-11-03T05:58:09+05:30 IST
జిల్లాలో రాజమహేంద్రవరం, కాకినాడలో ఉన్న ఐదు ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు అప్పుడే అడ్మిషన్లు ఇవ్వవద్దని పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులు(ఆర్జేడీ) ఆదేశించారు.
పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ
కాకినాడ, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రాజమహేంద్రవరం, కాకినాడలో ఉన్న ఐదు ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు అప్పుడే అడ్మిషన్లు ఇవ్వవద్దని పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులు(ఆర్జేడీ) ఆదేశించారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరు బాలాజీపేటలోని భాష్యం ఇంగ్లిష్ మీడియం పాఠశాల, మోరంపూడిలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్, కాతేరులో తిరుమల ఇంగ్లిష్ మీడియం హైస్కూల్, దానవాయిపేటలోని భాష్యం ఇంగ్లిష్ మీడియం పాఠశాల, కాకినాడలోని రవీంద్రభారతి ప్రైమరీ అడ్మిషన్లు జారీ చేయకుండా చూడాలని ఉన్నత పాఠశాలల యాజమాన్యాలకు ఆర్జేడీ సూచించారు.