ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీగా అప్పారావు
ABN , First Publish Date - 2020-12-01T06:19:25+05:30 IST
కాకినాడ క్రైం, నవంబరు 30: జిల్లా ఎస్సీ, ఎస్టీ సెల్-1 డీఎస్పీగా బి.అప్పారావు సోమవారం కాకినాడలో తన చాంబర్‌లో బాధ్యతలు తీసుకున్నారు.

కాకినాడ క్రైం, నవంబరు 30: జిల్లా ఎస్సీ, ఎస్టీ సెల్-1 డీఎస్పీగా బి.అప్పారావు సోమవారం కాకినాడలో తన చాంబర్‌లో బాధ్యతలు తీసుకున్నారు. ఆయన ఇప్పటి వరకు రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా డిస్ర్టిక్ట్ ట్రైనింగ్ సెంటర్ (డీటీసీ)లో సీఐగా పనిచేశారు. ఇటీవల సీనియర్ సిబ్బందికి ప్రభుత్వం ఇచ్చిన పదోన్నతుల్లో ఆయన డీఎస్పీగా పదోన్నతి పొందారు. గతంలో తుని, పిఠాపురం తదితర ప్రాంతాల్లో అప్పారావు సీఐగా పనిచేశారు.