‘కక్షతోనే నవీన్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు’

ABN , First Publish Date - 2020-10-07T09:31:57+05:30 IST

వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగానే టీడీపీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బనాయించినట్టు గోకవరంలోని దళిత సంఘాల నాయకులు అన్నారు...

‘కక్షతోనే నవీన్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు’

గోకవరం, అక్టోబరు 6: వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగానే టీడీపీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బనాయించినట్టు గోకవరంలోని దళిత సంఘాల నాయకులు అన్నారు. ఎక్స్‌కవేటర్‌ ఆపరేటర్‌ బీరా ధనకృష్ణ ఆ సమయంలో అక్కడ లేడని, కక్ష పూరితంగానే దళితుడైన ధనకృష్ణతో తప్పుడు కేసులు పెట్టించారన్నారు. కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షుడు గునిపే భరత్‌, గోకవరం మాల మహానాడు అధ్యక్షుడు కొల్లం సంపత్‌కుమార్‌, అశోక్‌, గున్నూరి లాజర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more