రేపటి నుంచి రాత్రి 9 వరకు సత్యదేవుడి దర్శనం

ABN , First Publish Date - 2020-09-06T10:10:27+05:30 IST

రేపటి నుంచి రాత్రి 9 వరకు సత్యదేవుడి దర్శనం

రేపటి నుంచి రాత్రి 9 వరకు సత్యదేవుడి దర్శనం

  • దేవస్థానం కొండపై బసచేసేందుకు అనుమతులు
  • వివాహాల నిర్వహణ, చిన్నారులు, వృద్ధుల ప్రవేశాలపై ఆంక్షలు

అన్నవరం, సెప్టెంబరు 5: ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో  ఈనెల 7 నుంచి స్వామివారి దర్శనాలు రాత్రి 9 గంటల వరకు సాగుతాయి. కరోనా నేపథ్యంలో ఇప్పటివరకు సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే దర్శనాలకు అనుమతిస్తున్నారు. అలాగే ఇప్పటిదాకా సత్రం గదుల కేటా యింపు నిలుపుదల చేసిన సంగతి తెలిసిందే. అన్‌లాక్‌ 4.0 ద్వారా ఆంక్షలకు మినహాయింపు లభించిన నేపథ్యంలో 7వ తేదీ నుంచి దేవస్థానం కొండపై భక్తులకు వసతి సౌకర్యం వినియోగించుకోవచ్చని పీఆర్వో కొండలరావు తెలిపారు. దర్శనాలకు మాత్రం పదేళ్లలోపు చిన్నారులు, 60 ఏళ్ల పైబడిన వృద్ధుల దర్శనాలకు తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు అనుమతించడం జరగదని, వివాహాలు, ఇతర శుభకార్యక్రమాలకు కూడా ఉన్నతాధికారుల ఆదే శాల మేరకు సడలించిన ఆంక్షలను త్వరలో వెల్లడిస్తామని ఆయన తెలిపారు.

Updated Date - 2020-09-06T10:10:27+05:30 IST