-
-
Home » Andhra Pradesh » East Godavari » sathya pramanam harttuch
-
సత్యప్రమాణాలతో భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దు
ABN , First Publish Date - 2020-12-28T05:51:10+05:30 IST
హిందూ దేవాలయాల్లో సత్యప్రమాణాల పేరుతో భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని జనసేన నాయకుడు రావా డ నాగు అన్నారు.

జనసేన నాయకుడు రావాడ నాగు
బిక్కవోలు, డిసెంబరు 27: హిందూ దేవాలయాల్లో సత్యప్రమాణాల పేరుతో భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని జనసేన నాయకుడు రావా డ నాగు అన్నారు. బిక్కవోలు లక్ష్మీగణపతి ఆలయంలో ఆయన ఆదివారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సత్యప్రమాణాలకు ప్రసిద్ధ లక్ష్మీగణపతి ఆలయాన్ని తాజా, మాజీ ఎమ్మెల్యేలు వేదికగా చేసుకోవడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని అన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా దేవదాయశాఖ దృష్టి సారించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో వీరమహిళ పాఠంశెట్టి కాశిరాణి, జనసేన నేతలు యడ్లపల్లి వీరసాయికృష్ణ, సుంకర బుజ్జి, కడిమి గోవిందు, నూతంగి శ్రీను, ఇందాల వీరబాబు పాల్గొన్నారు.