సంజీవని వచ్చేసింది

ABN , First Publish Date - 2020-07-15T10:32:35+05:30 IST

కరోనా నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో అనుమానితులు, బాధితుల నుంచి శ్వాబ్‌ నమూనాలు ..

సంజీవని వచ్చేసింది

మొబైల్‌ టెస్టింగ్‌ వెహికల్స్‌గా ఆర్టీసీ ఏసీ బస్సులు

జిల్లాకు చేరుకున్న మూడు వాహనాలు... నేడు ప్రారంభం 

 

రాజమహేంద్రవరం అర్బన్‌, జూలై 14: కరోనా నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో అనుమానితులు, బాధితుల నుంచి శ్వాబ్‌ నమూనాలు సేకరించడానికి ఆర్టీసీ ఏసీ బస్సులను సంజీవని (మొబైల్‌ టెస్టింగ్‌ వెహికల్‌)గా రూపొందించారు. ఇలాంటి మూడు బస్సులు మంగళవారం కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం డిపోలకు చేరాయి. సబ్‌ కలెక్టర్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వోల పర్యవేక్షణలో ఇవి పనిచేయనున్నాయి. వీటిని బుధవారం ప్రారంభించనున్నారు. కాగా ఈ మొబైల్‌ టెస్టింగ్‌ వెహికల్‌లో ఏకకాలంలో పది మందికి శ్వాబ్‌ తీయవచ్చని చెప్తున్నారు. ఈ బస్సులోనే ఉండే ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించి రిపోర్టులు కూడా వేగంగా ఇస్తారని సమాచారం. 


Updated Date - 2020-07-15T10:32:35+05:30 IST