-
-
Home » Andhra Pradesh » East Godavari » sand transport arrest
-
ఇసుక అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్ల సీజ్
ABN , First Publish Date - 2020-12-19T07:03:21+05:30 IST
అనపర్తి మండలం పులగుర్త నుంచి మండపేట పట్టణానికి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను మండపేట ఎస్‌ఐ రాజేష్‌కుమార్ శుక్రవారం సీజ్ చేశారు.

మండపేట, డిసెంబరు 18: అనపర్తి మండలం పులగుర్త నుంచి మండపేట పట్టణానికి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను మండపేట ఎస్‌ఐ రాజేష్‌కుమార్ శుక్రవారం సీజ్ చేశారు. సీఐ అడపా నాగమురళి ఆదేశాలతో ఎస్‌ఐ మండపేట పెద్ద కాల్వ వద్ద ట్రాక్టర్లను తనిఖీ చేశారు. రికార్డులు సక్రమంగా లేకపోవడంతో సీజ్ చేశారు. రాయవరం మండలం మహేంద్రవాడకు చెందిన వెలగల శివారెడ్డి, మండపేట మండలం పేకేటిపాకలుకు చెందిన చిట్టూరి శివలను అదుపులోకి తీసుకున్నారు. సీఐ నేతృత్వంలో ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.