ఇసుక లారీ ఢీకొని బాలుడి మృతి
ABN , First Publish Date - 2020-03-08T09:18:33+05:30 IST
ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ సెంటర్ వద్ద ఇసుక లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఓ బాలుడు మృతి

ధవళేశ్వరం, మార్చి 7: ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ సెంటర్ వద్ద ఇసుక లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఓ బాలుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కడియం మండలం చైతన్యనగర్‌కు చెందిన చెల్లుబోయిన తరుణ్ (16) పదో తరగతి చదువుతున్నాడు. స్నేహితుడు ఆవాల దుర్గారావుతో కలిసి శనివారం ఉదయం కొత్త ద్విచక్రవాహనానికి స్టిక్కరింగ్ చేయించుకుని రాజమ హేంద్రవరం నుంచి కడియం వెళుతున్నారు.
ధవళేశ్వరం బ్యారేజ్ సెంటర్‌కు వచ్చేసరికి ఇసుక లోడుతో వేమగిరి వైపు వెడుతున్న లారీ వీరి వాహ నాన్ని ఢీకొట్టింది. తరుణ్ ద్విచక్రవాహనంతోపాటు కొద్ది దూరం సిమెంట్ రోడ్డుపై దొర్లి పోయాడు. దీంతో తీవ్ర గాయా లపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న దుర్గారావుకు స్వల్ప గాయాల య్యాయి. ప్రమాద సమాచా రంతో ధవళేశ్వరం ఎస్‌ఐ గణేష్ ప్రమాద స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శవ పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌కు తరలించారు. దుర్గారావు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.