సచివాలయాల్లో డీడీవో తనిఖీలు

ABN , First Publish Date - 2020-11-13T06:12:04+05:30 IST

మండలంలోని కాపవరం, జంబూపట్నం గ్రామ సచివాలయాలను డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి రత్నకుమారి గురువారం తనిఖీ చేశారు.

సచివాలయాల్లో డీడీవో తనిఖీలు

కోరుకొండ, నవంబరు 12: మండలంలోని కాపవరం, జంబూపట్నం గ్రామ సచివాలయాలను డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి రత్నకుమారి గురువారం తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, వలంటీర్ల పనితీరు, పన్నుల వసూళ్లు ఇతర పంచాయతీ రికార్డులను పరిశీలించారు. మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలతోపాటు రైతు భరోసా కేంద్రాలు, వైఎస్‌ఆర్‌ హెల్త్‌క్లినిక్‌ల నిర్మాణంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతకుముందు మండల పరిషత్‌ కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు, వలంటీర్లకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో నరేష్‌కుమార్‌, ఎంపీఏవో కృష్ణమూర్తి, ఈవోపీఆర్‌డీ స్పర్జన్‌, వశిష్ట పాల్గొన్నారు.

Updated Date - 2020-11-13T06:12:04+05:30 IST