రంగంపేట సచివాలయంలో కలెక్టర్ తనిఖీలు
ABN , First Publish Date - 2020-12-05T06:17:50+05:30 IST
సచివాలయ ఉద్యోగులంతా ప్రజలకు సేవ చేయడానికి కేటాయించాలని, ఎవరూ ఉద్యోగానికి గైర్హాజరు కాకుండా ఉండాలని కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి సూచించారు.

రంగంపేట, డిసెంబరు 4: సచివాలయ ఉద్యోగులంతా ప్రజలకు సేవ చేయడానికి కేటాయించాలని, ఎవరూ ఉద్యోగానికి గైర్హాజరు కాకుండా ఉండాలని కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి సూచించారు. రంగంపేట సచివాలయం-1ని కలెక్టర్ శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరుపట్టీ, మూమెంట్ రిజిస్టర్ పరిశీలించారు. ఇందులో ఇద్దరు ఉద్యోగుల సంతకాలు లేకపోవటం గుర్తించారు. అక్కడే వైఎస్సార్ బీమా నమోదు చేస్తున్న వలంటీర్లను కలెక్టర్ ప్రశ్నించి సమాధానాలు రాబట్టారు. నమోదులో తగిన జాగ్రత్త వహించాలని సూచించారు. కలెక్టర్‌కు సచివాలయ ఉద్యోగులు సచివాలయ వివరాలను తెలియజేశారు.