ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ పౌష్టికాహారం తీసుకోవాలి: ఎస్పీ

ABN , First Publish Date - 2020-08-01T11:13:08+05:30 IST

ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా ఉన్న పోలీస్‌ సిబ్బంది అంతా తప్పనిసరిగా పౌష్టికాహారాన్ని తీసుకోవాలని ఎస్పీ అద్నాన్‌ నయీం ..

ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ పౌష్టికాహారం తీసుకోవాలి: ఎస్పీ

కాకినాడ క్రైం, జూలై 31: ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా ఉన్న పోలీస్‌ సిబ్బంది అంతా తప్పనిసరిగా పౌష్టికాహారాన్ని తీసుకోవాలని ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ సూచించారు. జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న ఒక కమ్యూనికేషన్‌ ఎస్‌ఐ, ఒక కానిస్టేబుల్‌, ఒక మహిళా హోంగార్డ్‌, వీరమరణం పొందిన విషయం తెలిసిందే. జిల్లావ్యాప్తంగా 238మంది పోలీస్‌ అధికారులు, సిబ్బంది కొవిడ్‌ బారిన పడ్డారని, వారిలో 219మంది హోం ఐసోలేషన్‌లో, 10మంది వివిధ ఆస్పత్రుల్లో, ఆరుగురు పలు కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. వారందరితో ఎస్పీ, అడిషనల్‌ ఎస్పీలు, డీఎస్పీలు ఎప్పటికప్పుడు వీడియోకాల్‌ ద్వారా మాట్లాడుతూ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ వారిలో మనోధైర్యాన్ని నింపుతున్నారు.


ఇందులో భాగంగా కొవిడ్‌ బారిన పడిన సిబ్బందికి జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం పోషక విలువలతో కూడిన డ్రై ఫ్రూట్స్‌ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కొవిడ్‌-19తో పోరాటం చేస్తున్న అధికారులు, సిబ్బంది అంతా త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అడ్మిన్‌ ఎస్పీ కరణం కుమార్‌, ఏఆర్‌ అడ్మిన్‌ ఎస్పీ వీఎస్‌ ప్రభాకరరావు, ఎస్‌బీ డీఎస్పీలు ఎం.అంబికాప్రసాద్‌, ఎస్‌.మురళీమోహన్‌, ఏఆర్‌ డీఎస్పీ ఎస్‌వీ అప్పారావు, ఏఆర్‌ ఆర్‌ఐ ఈశ్వరరావు, జిల్లా పోలీస్‌ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పి.సత్యమూర్తి పాల్గొన్నారు.

Updated Date - 2020-08-01T11:13:08+05:30 IST