ఆరోపణలు కాదు.. వాస్తవాలు

ABN , First Publish Date - 2020-12-13T06:22:44+05:30 IST

నియోజకవర్గంలో వైసీపీ నాయకులు చేస్తున్న అవినీతి కార్యక్రమాలపై తాము చేస్తున్నవి ఆరోపణలు కాదని వాస్తవాలను అందుకే తాము చెప్పిన ఒక్క అంశంపై కూడా వైసీపీ నాయకులు సమాధానం చెప్పలేక పోతున్నారని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.

ఆరోపణలు కాదు.. వాస్తవాలు

అనపర్తి, డిసెంబరు 12: నియోజకవర్గంలో వైసీపీ నాయకులు చేస్తున్న అవినీతి కార్యక్రమాలపై తాము చేస్తున్నవి ఆరోపణలు కాదని వాస్తవాలను అందుకే తాము చెప్పిన ఒక్క అంశంపై కూడా వైసీపీ నాయకులు సమాధానం చెప్పలేక పోతున్నారని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం రామవరంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాపవరం సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే తమపై ఆవేశపూరితంగా ఆరోపణలు చేశారని అయితే కాపవరం గ్రా మంలో జరగుతున్న అక్రమ గ్రావెల్‌ మైనింగ్‌ను తా ము అడ్డుకోవడంతో ఆయన ఆక్రోశానికిలోనై మా ట్లాడారన్నారు. తెలుగుదేశం నాయకులు ఆరోపణలు చేస్తున్నారని ఆధారాలు చూపాలని ఎమ్మెల్యే అంటు న్నారని అయితే తాము ఆదారాలు లేకుండా ఒక్క అంశంపై కూడా మాట్లాలేదన్నారు. టీడీపీ నాయకులు కొవ్వూరి శ్రీనివాసరెడ్డి, కర్రి వెంకటరామారెడ్డి, మామిడిశెట్టి శ్రీను, అచ్చిరెడ్డి, బాబూరావు పాల్గొన్నారు.



Updated Date - 2020-12-13T06:22:44+05:30 IST