స్కూటీల దొంగ అరెస్టు

ABN , First Publish Date - 2020-02-12T09:02:25+05:30 IST

బైక్‌ నడపడం చేతకాకపోవడంతో స్కూటీలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్టుచేశారు.

స్కూటీల దొంగ అరెస్టు

అమలాపురం టౌన్‌, ఫిబ్రవరి 11: బైక్‌ నడపడం చేతకాకపోవడంతో స్కూటీలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్టుచేశారు. అమలాపురం పట్టణ సీఐ జి.సురేష్‌బాబు వివరాల ప్రకారం.. రాజోలు మండలం పొన్నమండ గ్రామానికి చెందిన పోలిశెట్టి బాబ్జి డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదివి మానేశాడు. అప్పటినుంచి పలుచోట్ల బ్రాందీ షాపుల్లో సేల్స్‌మెన్‌గా పనిచేశాడు. వ్యసనాలకు బానిసైన బాబ్జి అమలాపురంలో వరుస చోరీలకు పాల్పడ్డాడు. పట్టణంలోని మార్కెట్‌ సెంటర్‌, ధన్వంత రీనాయుడు ఆసుపత్రి, గ్రీన్‌ట్రీ హోటల్‌, శ్రీనిధి ఆసుపత్రులతోపాటు రాజోలు ప్రభుత్వాసుపత్రి వద్ద పార్కింగ్‌ చేసిన స్కూటీలను చోరీ చేశాడు. మార్కెట్‌ సెంటర్‌లో రంకిరెడ్డి వీరగోపికి చెందిన స్కూటీ చోరీ చేశాడు. అనంతరం వీడియో ఫుటేజీల ఆధారంగా బాబ్జిని అరెస్టుచేసి అతడి నుంచి ఐదు స్కూటీలను స్వాఽధీనం చేసుకున్నట్టు సీఐ తెలిపారు.

Updated Date - 2020-02-12T09:02:25+05:30 IST