రోడ్ల దుస్థితిపై బీజేపీ ఆందోళన

ABN , First Publish Date - 2020-12-06T06:57:38+05:30 IST

రోడ్ల దుస్థితిని పట్టించుకోని ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా అధ్వానంగా ఉన్న రోడ్ల వద్ద శనివారం ధర్నాలు నిర్వహించింది.

రోడ్ల దుస్థితిపై బీజేపీ ఆందోళన
కొత్తపేటలో రోడ్ల దుస్థితిపై నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీర్రాజు, నేతలు

కాకినాడ (ఆంధ్రజ్యోతి), డిసెంబరు 5 : రోడ్ల దుస్థితిని పట్టించుకోని ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా అధ్వానంగా ఉన్న రోడ్ల వద్ద శనివారం ధర్నాలు నిర్వహించింది. కోనసీమతోపాటు కాకినాడ, రాజమహేంద్రవరం, అన్ని మండల కేంద్రాల వద్ద ఈ నిరసనలు జరిగాయి. కొత్తపేటలో జరిగిన ధర్నాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ రోడ్లు అధ్వానంగా ఉండడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, ఎందరో ప్రాణాలను కోల్పోతున్నారన్నారు. యుద్ధప్రాతిపదికన రోడ్ల నిర్మాణం, మరమ్మతులు చేపట్టాలని డిమాండు చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమాల్లో చాలాచోట్ల జనసేన కూడా పాల్గొంది. సర్పవరం ఆటోనగర్‌ నుంచి పాదయాత్ర చేపట్టి మాధవపట్నం-సర్పవరం రహదారిపై బీజేపీ పార్లమెంటరీ అధ్యక్షుడు సీహెచ్‌ రామ్‌కుమార్‌, జనసేన పీఏసీ సభ్యులు పంతం నానాజీల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.Read more