రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ABN , First Publish Date - 2020-12-06T05:53:48+05:30 IST

రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. రాజమహేంద్రవరంలోని మంగళవారపుపేటకు చెందిన నాళం విజయశ్రావణి(30), ఆమె భర్త చైతన్యగుప్తా మోటారుసైకిల్‌పై శనివారం పశ్చిమగోదావరి జిల్లా ఖండవిల్లిలోని బంధువుల ఇంటికి బయలుదేరారు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రావులపాలెం రూరల్‌, డిసెంబరు 5: రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. రాజమహేంద్రవరంలోని మంగళవారపుపేటకు చెందిన నాళం విజయశ్రావణి(30), ఆమె భర్త చైతన్యగుప్తా మోటారుసైకిల్‌పై శనివారం పశ్చిమగోదావరి జిల్లా ఖండవిల్లిలోని బంధువుల ఇంటికి బయలుదేరారు. రావులపాలెం మండలం రావులపాడు వంతెన సమీపానికి వచ్చేసరికి వెనుకనుంచి వేగంగా వస్తున్న ట్రాలీ లారీ వారిని బలంగా ఢీకొంది. దీంతో చైతన్యగుప్తా స్వల్పగాయాలతో బయటపడగా విజయశ్రావణికి తీవ్రగాయాలయ్యాయి. అంబులెన్స్‌లో కొత్తపేట ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆమె మృతిచెందింది.   కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ పి.బుజ్జిబాబు తెలిపారు. 


 

 

Read more