సులభంగా, నాణ్యతతో రెవెన్యూ సేవలు: ఆర్డీవో

ABN , First Publish Date - 2020-11-13T06:15:40+05:30 IST

రంపచోడవరం డివిజన్‌లోని 7మండలాల్లో సచివాలయాల ద్వారా అందించే అన్ని రకాల రెవెన్యూ సేవలు సులభంగా, నాణ్యతతో అందించడమే లక్ష్యంగా సిబ్బందికి శిక్షణ ఇస్తున్నట్టు ఆర్డీవో శీనా నాయక్‌ తెలిపారు.

సులభంగా, నాణ్యతతో రెవెన్యూ సేవలు: ఆర్డీవో

రాజవొమ్మంగి, నవంబరు 12: రంపచోడవరం డివిజన్‌లోని 7మండలాల్లో సచివాలయాల ద్వారా అందించే అన్ని రకాల రెవెన్యూ సేవలు సులభంగా, నాణ్యతతో అందించడమే లక్ష్యంగా సిబ్బందికి శిక్షణ ఇస్తున్నట్టు ఆర్డీవో శీనా నాయక్‌ తెలిపారు. గురువారం స్థానిక తహశీల్దారు కార్యాలయంలో వీఆర్వోలు, సర్వేయర్లు, డిజిటల్‌ అసిస్టెంట్‌లకు శిక్షణ ఇచ్చారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ డివిజన్‌లోని 92 సచివాలయాల ద్వారా ఈ సిబ్బంది పని చేస్తుండగా, ప్రజలకు మెరుగైన సేవలను అందించే వారిని మండలాలు, క్లస్టర్‌లలో గుర్తిస్తామని చెప్పారు. గంగవరం మండలం మొదటి స్థానంలో ఉండగా మారేడుమిల్లి, దేవిపట్నం, రంపచోడవరం, రాజవొమ్మంగి, వై రామవరం, అడ్డతీగల తర్వాతి స్థానాల్లో ప్రజలకు సేవలందిస్తున్నట్టు గుర్తించామన్నారు. రాజవొమ్మంగిలో దూసరపాము వీఆర్వో మండలంలో మొదటి స్థానం, డివిజనల్‌లో 26లో ఉన్నట్టు తెలిపారు. డివిజన్‌లో మొదటి స్థానంలో కుండాడ వీఆర్వో ఉన్నారని తెలిపారు. అడ్డతీగలలో వీఆర్వో మురళీకృష్ణ పని తీరు బాగుందన్నారు. కాగా ఎస్సీ, ఎస్టీ కేసులకు చెంది 16 నమోదు కాగా 11పెండింగ్‌లో ఉన్నట్టు తెలిపారు. ఆర్డీవో వెంట తహశీల్దారు సుబ్రహ్మణ్యాచారులు, డీటీ సత్యనారాయణ ఉన్నారు.

Updated Date - 2020-11-13T06:15:40+05:30 IST