రిజిస్ట్రేషన్లతో రూ.116 కోట్ల ఆదాయం

ABN , First Publish Date - 2020-10-07T10:30:01+05:30 IST

కరోనా ప్రభావం రిజిస్ట్రేషన్లశాఖ మీద చూపినా మే 5 నుంచి రిజిస్ట్రేషన్లు వేగవంతం కావడంతో రూ.116 కోట్ల ఆదాయం వచ్చిందని ఆ శాఖ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (డీఐజీ) టి.సరోజ తెలిపారు...

రిజిస్ట్రేషన్లతో రూ.116 కోట్ల ఆదాయం

రిజిస్ట్రేషన్లశాఖ డీఐజీ సరోజ


కడియం, అక్టోబరు 6: కరోనా ప్రభావం రిజిస్ట్రేషన్లశాఖ మీద చూపినా మే 5 నుంచి రిజిస్ట్రేషన్లు వేగవంతం కావడంతో రూ.116 కోట్ల ఆదాయం వచ్చిందని ఆ శాఖ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (డీఐజీ) టి.సరోజ తెలిపారు. మంగళవారం కడియం సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయ పరిశీలనకు వచ్చిన ఆమె కడియపులంక శివాంజనేయనర్సరీ అధినేత మల్లు పోలరాజు నర్సరీకి విచ్చేశారు. ఈ సందర్భంగా పోలరాజు సరోజకు విదేశీ రకానికి చెందిన పాయించిటియా రెడ్‌ అనే మొక్క అందజేసి స్వాగతం పలికారు. నర్సరీలో వివిధ రకాల మొక్కలను చూశారు. అనంతరం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ తన పరిధిలో ఉన్న 32 రిజిస్టార్‌ కార్యాలయాల్లోను 18 ప్రభుత్వ భవనాలు కాగా మిగిలిన 14 అద్దె భవనాల్లో నడుస్తున్నాయన్నారు. 18 భవనాలు కూడా చాలాకాలం క్రితం నిర్మించడంతో అవి కూడా పాడయ్యాయన్నారు. సెప్టెంబరు వరకు రూ.198 కోట్లు లక్ష్యం కాగా రూ.116 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందని చెప్పారు. సెప్టెంబరులో మాత్రం రూ.23 కోట్లు వచ్చాయని తెలిపారు. ఆమె వెంట కడియం సబ్‌ రిజిస్టార్‌ రత్నాకర్‌, కడియం మండల దస్తావేజులేఖర్ల సంఘం అధ్యక్షుడు వనుం శ్రీనివాస్‌ ఉన్నారు. 

Read more