డబుల్‌ థమాకా!

ABN , First Publish Date - 2020-06-25T10:07:26+05:30 IST

వైసీపీ ప్రభుత్వం నవరత్నాలు అమలులో భాగంగా పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం చేపట్టిన భూసేకరణలో అద్భుత మాయాజాలలు

డబుల్‌ థమాకా!

భూసేకరణలో ‘రెవెన్యూ’ మాయాజాలం

జగన్నాఽథపురంలో 6.78 ఎకరాల భూ సేకరణ,రూ. 3.25 కోట్లకుగాను రూ. 6.50 కోట్లు చెల్లింపు 

ఒకే భూమికి రెండు సార్లు చెల్లింపులు చేయడం రెవెన్యూ ఉద్యోగుల వ్యూహామేనా?

గత నెలలో రెండు బ్యాంకులకు సొమ్ములు నిలిపివేయాలని నోటీసులు ఇచ్చిన ఆర్డీవో

అప్పటికే బ్యాంకులు నుంచి మొత్తం సొమ్ములు  విత్‌డ్రా చేసుకున్న ఖాతాదారులు

ఆర్‌ఆర్‌ యాక్ట్‌ ప్రకారం రికవరీ చేస్తాం - ఆర్డీవో


(అమలాపురం - ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం నవరత్నాలు అమలులో భాగంగా పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం చేపట్టిన భూసేకరణలో అద్భుత మాయాజాలలు ప్రదర్శిస్తున్నారు రెవెన్యూ అధికారులు. ధరలేని భూములకు అధిక ధరలు చెల్లించి కమీషన్లు కోసం కొనుగోలు చేస్తున్న పద్ధతి ఒకటైతే, సాధ్యంకాని నిబంధనలతో ఒక వ్యక్తి నుంచి సేకరించిన భూమికి రెండు పర్యాయాలు కోట్ల రూపాయల సొమ్ములు చెల్లించి ఉదారతను చాటారు అమలాపురం ఆర్డీవో కార్యాలయం ఉద్యోగి ఒకరు. తహశీల్దార్‌తో కలిపి ఈ తరహా ఆన్‌లైన్‌ మోసానికి పాల్పడిన అంశం వెలుగులోకి వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంపై రెవెన్యూ అధికారులు మాత్రం లైట్‌ తీసుకుంటున్న తీరు సర్వత్రా చర్చ నీయాంశమైంది. అయినవిల్లి మండలం కె జగన్నాఽథపురంలో రైతుల నుంచి సేకరిం చిన భూ వ్యవహారంలో భారీగా అక్రమాలు వెలుగుచూస్తున్నాయి.


అయినవిల్లి మం డలం కె జగన్నాఽథపురం గ్రామానికి చెందిన ఒక రైతుకు ఎకరానికి రూ.45 లక్షలు చెల్లించి కొంటే పక్కనే ఉన్న సరిహద్దు రైతు నుంచి ఎకరాకు రూ.48 లక్షల చొప్పున కొనుగోలు చేశారు. ఇక్కడ మద్యవర్తులకు మామూళ్లు చెల్లించేవిధంగా అంగీకార పత్రాన్ని కూడా సిద్ధం చేసుకున్నారంటే భూసేకరణలో అక్రమాలు ఏ రీతిన సాగు తున్నాయో అర్ధమవుతుంది. ఇక్కడ ఒకే రైతు నుంచి సేకరించిన భూమికి చెల్లించా ల్సిన దానికంటే రెట్టింపు మొత్తాన్ని చెల్లించినప్పటికీ ఆ తప్పిదాలను మూడు నెలలు తర్వాత ఉద్యోగులు గుర్తించారు. కె జగన్నాథపురం గ్రామంలో శ్రీఘాకొళపు రామ సుబ్రహ్మణ్యం కుటుంబానికి చెందిన సర్వే నెంబర్‌ 2/1లో 6.78 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఇందుకు సంబంఽధించి 1.89 ఎకరాలకుగాను బ్యాంకు అకౌంట్‌ నెంబరు 562210110000014 సంబంధించి రూ.90,72,000 నగదు మార్చి 31న రెవె న్యూ అధికారులు చెల్లించారు.


అతని కుమారుడు శ్రీఘాకొళపు రాజారావుకు చెందిన 4.89 ఎకరాలకుగాను బ్యాంకు అకౌంట్‌ నెంబర్‌ : 000890100121595 రూ.2,34,72, 000 నగదు చెల్లించారు. ఎకరాకు రూ.48 లక్షల చొప్పున మొత్తం 6.78 ఎకరాలకు సంబంధించి రూ.3,25,44000 నగదు చెల్లించారు. అదే అకౌంట్లకు రెండవసారి మొ త్తం రూ.3,25,44000 నగదును వారి అకౌంట్లకు జమ చేశారు. ఒకే టోకెన్‌ నెంబర్‌పై రెండు సార్లు నగదు చెల్లింపులు జరగడం సాద్యం కాదని రెవెన్యూ అధికారులే చెబు తున్నారు. అయితే టోకెన్‌ నెంబర్‌ మార్చి అదనంగా మరో సారి ఉద్దేశపూర్వకంగానే ఆర్డీవో కార్యాలయ కీలక ఉద్యోగితోపాటు అయినవిల్లి తహశీలాఽ్దర్‌ ప్రమేయంతో ఈ చెల్లింపులు జరిగాయా అనే అరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే లబ్ధిదారుడు ముఖ్యమంత్రి సహాయ నిధికి కూడా తన వంతు సహాయాన్ని ఈ కింద రూ. లక్ష చెక్కును అమలాపురంలో మంత్రి విశ్వరూప్‌కి కూడా అందించినట్టు సమాచారం. ఆర్డీవో కార్యాలయ కీలక ఉద్యోగి కనుసన్నల్లో జరిగిన రూ.3.25 కోట్ల అదనపు చెల్లిం పు వ్యవహారాన్ని ఒక చిరు ఉద్యోగి ఆర్డీవో దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. దీని పై స్పందించిన ఆయన నగదు జమ చేసిన రెండు బ్యాంకులకు నోటీసులు ఇచ్చి ఆ మొత్తాలు విత్‌డ్రా కాకుండా చూడాలని అ నోటీసులో పేర్కొన్నారు.


అయితే అప్ప టికే అకౌంట్‌లో పడ్డ అదనపు మొత్తాన్ని సైతం విత్‌డ్రా చేసుకుని ఇతర బ్యాంకుల్లో డిపాజిట్లు చేసినట్టు తెలిసింది. వాటిపై వ్యూహాత్మకంగా రుణాలు కూడా పొందినట్టు సమాచారం. రెండున్నర నెలలు అనంతరం మేల్కొన్న ఆర్డీవో కార్యాలయ ఉద్యోగులు బ్యాంకులకు నోటీసులు ఇచ్చినప్పటికీ అప్పటికే సొమ్ములు విత్‌డ్రా కావడంతో ఇప్పు డు రెవెన్యూ ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. సదరు సొమ్మును వారి నుంచి రికవరీ చేస్తాం, ఇది పెద్ద విషయం కాదంటూ ఆర్డీవో భవానీశంకర్‌ చెబుతున్నారు.


Updated Date - 2020-06-25T10:07:26+05:30 IST