-
-
Home » Andhra Pradesh » East Godavari » revenue employes meeting
-
డిప్యూటీ తహశీల్దార్లుగా పదోన్నతి కల్పించాలి
ABN , First Publish Date - 2020-10-31T06:17:52+05:30 IST
రెండు సంవత్సరాల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కోర్సు పూర్తి చేసిన వారి స్థానంలో అర్హులైన సీనియర్ అసిస్టెంట్లను నియమించాలని, అర్హులైన సీనియర్ అసిస్టెంట్లకు డిప్యూటీ తహశీల్దార్లుగా పదోన్నతి కల్పించాలని కోరుతూ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా శాఖ సమావేశంలో తీర్మానం చేశారు.

డెయిరీఫారమ్ సెంటర్(కాకినాడ), అక్టోబరు 30: రెండు సంవత్సరాల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కోర్సు పూర్తి చేసిన వారి స్థానంలో అర్హులైన సీనియర్ అసిస్టెంట్లను నియమించాలని, అర్హులైన సీనియర్ అసిస్టెంట్లకు డిప్యూటీ తహశీల్దార్లుగా పదోన్నతి కల్పించాలని కోరుతూ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా శాఖ సమావేశంలో తీర్మానం చేశారు. ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా శాఖ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం శక్రవారం ముద్దాడ రవిచంద్ర రెవెన్యూ భవన్‌లో నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు పితాని త్రినాథ్ రాష్ట్ర సహోధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ డివిజనల్ యూనిట్లలో ఖాళీగా ఉన్న పదవులలో కోఆప్షన్ ద్వారా ఉద్యోగుల నియామకం చేపట్టేందుకు తేదీలు ఖరారు చేసి జిల్లా అసోసియేషన్‌కు పంపితే తదుపరి చర్యలు తీసుకుంటామని త్రినాథ్ అన్నారు. కొవిడ్‌తో మృతి చెందిన ఉద్యోగులకు సంతాపం తెలిపారు.