ఐసోలేషన్‌ కేంద్రం ఏర్పాటుపై స్థానికుల ఆందోళన

ABN , First Publish Date - 2020-03-25T10:05:45+05:30 IST

పట్టణంలోని గొల్లపుంతలో అందరికీ ఇళ్ల అపార్ట్‌ మెంట్‌లో వంద పడకల క్వారంటైన్‌ ఏర్పాటు చేసేందుకు అధికారులు చేసిన ప్రయత్నాన్ని మంగళవారం కాలనీ వాసులు అడ్డుకున్నారు.

ఐసోలేషన్‌ కేంద్రం ఏర్పాటుపై  స్థానికుల ఆందోళన

మండపేట, మార్చి 24: పట్టణంలోని గొల్లపుంతలో అందరికీ ఇళ్ల అపార్ట్‌ మెంట్‌లో వంద పడకల క్వారంటైన్‌ ఏర్పాటు చేసేందుకు అధికారులు చేసిన ప్రయత్నాన్ని మంగళవారం కాలనీ వాసులు అడ్డుకున్నారు. ఐసోలేషన్‌ కేంద్రానికి  వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. వీరికి టీడీపీ, వైసీపీ, జనసేన నాయకులు మద్దతు పలికారు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ నాగమురళి సంఘటనా స్థలంలో ఆందోళనకారులతో మాట్లాడారు. ఐసొల్యూషన్‌ కేంద్రాన్ని మార్చాలని మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ చుండ్రు శ్రీవరప్రకాష్‌, వైసీపీ, జనసేన నాయకులు రెడ్డి రాధాకృష్ణ, వేగుళ్ల లీలాకృష్ణ కోరారు. పట్టణంలోని జూనియర్‌, డిగ్రీ కళాశాలలో ఐసొలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆందోళనకారులు కోరారు. అధికారులు, నేతల హామీతో ఆందోళన విరమించారు. 

Read more