చెట్లకొమ్మల తొలగింపు
ABN , First Publish Date - 2020-10-02T08:19:09+05:30 IST
రాజపూడి సబ్స్టేషన్ పరిధిలో విద్యుత్ వైర్లను తాకుతున్న చెట్టుకొమ్మలను గురువారం ఎలక్ట్రికల్ డీఈ డేవిడ్ ..
జగ్గంపేటరూరల్, అక్టోబరు 1: రాజపూడి సబ్స్టేషన్ పరిధిలో విద్యుత్ వైర్లను తాకుతున్న చెట్టుకొమ్మలను గురువారం ఎలక్ట్రికల్ డీఈ డేవిడ్, ఏడీఈ లక్ష్మీనారాయణ ఆఽధ్వర్యంలో లైన్మెన్ రామచంద్రరావు, సిబ్బంది తొలగించారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు సరఫరా నిలిపివేశారు. రాజపూడి, మన్యవారిపాలెం, మల్లిశాల, వెంగాయమ్మపురం, కృష్ణాపురం, గోవిందపురం, సీతారాంపురం, జె.కొత్తూరు చెట్ల కొమ్మలను తొలగించి, లైన్లకు మరమ్మతులు చేపట్టారు.