-
-
Home » Andhra Pradesh » East Godavari » remand khaidi death
-
రిమాండ్ ఖైదీ మృతి
ABN , First Publish Date - 2020-12-19T06:10:23+05:30 IST
ఆత్మహత్యాయత్నానికి పాల్పడి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఓ రిమాండ్ ఖైదీ పరిస్థితి విషమించి శుక్రవారం మృతి చెందాడు.

కాకినాడ క్రైం, డిసెంబరు 18: ఆత్మహత్యాయత్నానికి పాల్పడి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఓ రిమాండ్ ఖైదీ పరిస్థితి విషమించి శుక్రవారం మృతి చెందాడు. కాజులూరు మండలం, ఆర్యావటానికి చెందిన కోడి చెన్నకేశవ(28) కరప మండలంలో జరిగిన ఓ దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్నాడు. దీంతో అతడిని కరప పోలీసులు నాలుగు రోజుల క్రితం అరెస్టు చేసి ఈ నెల 29 వరకు రిమాండ్ విధిస్తూ కాకినాడ సబ్ జైలుకు తరలించారు. అయితే తనను దొంగతనం కేసులో అన్యాయంగా ఇరికించారంటూ మనస్తాపం చెందిన చెన్నకేశవ సబ్ జైల్ ప్రాంగణంలో గడ్డి నివారణ కోసం ఉంచిన గడ్డి మందును గురువారం తాగాడు. జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.